
లైంగిక వేధింపుల నిరోధానికి చర్యలు
ఆసిఫాబాద్: మహిళలపై లైంగిక వేధింపులు నిరో దించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా సంక్షేమ అధికారి అడెపు భాస్కర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం సంయుక్తంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. పని ప్రదేశాలు, సమాజంలో మహిళలపై ఎదురయ్యే లైంగిక వేధిపుల నిరోధానికి పోష్ యాక్ట్ 2013 అమలు చేస్తూ గౌరవంగా పనిచేసుకునే వాతావరణం కల్పిస్తామన్నారు. మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, వేధింపులకు పాల్పడటంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ప్రభుత్వేతర సంస్థల్లో పనిచేసే మహిళలందరికీ ఈ చట్టం వర్తిస్తుందని స్పష్టం చేశారు. బాధితులు కమిటీలో ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌వో సీతారాం, జిల్లా సమన్వయకర్త శారద, డాక్టర్ అనూషరాణి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.