
కలెక్టరేట్ ఎదుట ఏఎన్‌ఎంల ధర్నా
ఆసిఫాబాద్‌అర్బన్: ఎన్‌సీడీ ప్రోగ్రాంలో ఆన్‌లైన్ ప నుల నుంచి విముక్తి కల్పించాలని జిల్లా కేంద్రంలో ని కలెక్టరేట్ ఎదుట సోమవారం ఏఎన్‌ఎంలు ధర్నా చేపట్టారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.ఉపేందర్ మాట్లాడుతూ పదేళ్లుగా ఏఎన్‌ఎంలు ఎన్‌సీడీ ఆన్‌లైన్ చేయడానికి ఇబ్బందులు పడుతున్నారన్నారు. రోజుకు 12 గంటల పాటు విధుల్లో ఉండటంతో వారిపై పనిభారం పడుతుందని పే ర్కొన్నారు. ఇప్పటికైనా ఎన్‌సీడీ ప్రోగ్రాం నుంచి ఏఎన్‌ఎంలకు విముక్తి కల్పించాలన్నారు. అనంతరం కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు దివాకర్, ఉపాధ్యక్షుడు ఆత్మకూరి చిరంజీవి, ఏఎన్‌ఎం యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సంతోషి, ప్రధాన కార్యదర్శి పుణ్యవతి, ఏఎన్‌ఎంలు సునీత, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.