
సీఐ కాళ్లపై పడిన రైతు
పంటలకు కావాల్సిన యూరియా బస్తాలు అందించేలా చూడాలని రెబ్బెన మండలం నవేగాంకు చెందిన ఓ రైతు సీఐ సంజయ్ కాళ్లపై పడి వేడుకున్నాడు. సోమవారం మండల కేంద్రంలోని పీఏసీఎస్ ఎదుట జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తుండగా అక్కడికి సీఐ సంజయ్ వచ్చారు. అధికారులు నిర్లక్ష్యం చేస్తూ తమను ఇబ్బందులపాలు చేస్తున్నారని, వెంటనే యూరియా ఇచ్చేలా చూడాలని రైతు సీఐ కాళ్లపై పడ్డాడు. అక్కడే ఉన్న సిబ్బంది అతడిని పైకి లేపారు. పీఏసీఎస్‌కు వచ్చిన ఒక్క లారీ లోడు యూరియా టోకెన్లు ఉన్నవారిలో సగం మందికి కూడా సరిపోలేదు.