
ఆహార భద్రత ప్రమాణాలు పాటించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: దుకాణాదారులు, హోటల్ ని ర్వాహకులు ఆహార భద్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడాలని భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ సర్టిఫైడ్ శిక్షకురాలు భార్గవి కంచర్ల సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎం గార్డెన్స్‌లో దు కాణాదారులు, హోటళ్ల నిర్వాహకులకు ఎంసీఈడీ (మహారాష్ట్ర సెంటర్ ఫర్ ఆంత్రపెన్యూర్ షిప్ డెవలప్‌మెంట్) ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా భార్గవి మాట్లాడుతూ.. ప్రభుత్వం నిషేధించిన ఆహార రంగులు, ఉప్పు వి నియోగించవద్దని, మంచినూనెను మూడుసార్ల కంటే ఎక్కువగా మరిగించి వాడొవద్దని సూచించారు. హోటల్ నిర్వాహకులు, వంటి సిబ్బంది ఆర్నెళ్లకో సారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపా రు. ఆహార భద్రత ప్రమాణాల చట్టం–2006ను తె లుసుకోవాలని, ఆరోగ్యకర నూనెలు, పదార్థాలు వినియోగిస్తే మార్కెట్‌లో బిజినెస్ పెరుగుతుందని సూచించారు. కార్యక్రమంలో రీజినల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, మహేందర్‌రెడ్డి, జిల్లా కోఆర్డినేటర్ అ చ్యుత్‌కుమార్, సభ్యులు శ్రీనివాస్, విజయ్, మహే శ్, భానుచందర్ తదితరులు పాల్గొన్నారు.