
సొంతింటి కల నెరవేర్చుకోవాలి
దహెగాం: లబ్ధిదారులు ఇందిరమ్మ పథకాన్ని సద్వి నియోగం చేసుకుని సొంతింటి కల నెరవేర్చుకోవా లని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు సూచించా రు. శనివారం మండల కేంద్రంలోని రైతువేదికలో మండలంలోని ఆయా గ్రామాల లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరయ్యాయని, అదనంగా మరో 500 ఇళ్ల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చా రు. మండలంలో పైలట్ గ్రామమైన దిగిడకు 12 ఇళ్లు మంజూరు కాగా, నిర్మాణాలు చివరి దశలో ఉ న్నాయని తెలిపారు. మండలానికి 244 ఇళ్లు మంజూరు కాగా, 207 నిర్మాణాలు ఇదివరకే ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. ప్రస్తుతం మరో 37 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించామని పేర్కొన్నారు. మండలానికి మరో 150 ఇళ్లు మంజూరు చేయిస్తానని చెప్పారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.10వేల పరిహారం ఇస్తుందని, స ర్వే పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు సూచించారు. మండలంలోని పెసరికుంట, మొట్లగూడ పంచాయతీలకు పక్కా భవన నిర్మాణాల కోసం రూ.20 లక్షల చొప్పున ఈజీఎస్ నిధులు మంజూరైనట్లు తెలిపారు. కల్వాడ నుంచి ఒడ్డుగూడ వరకు డబుల్ రోడ్డు మంజూరైందని, త్వరలో టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఒడ్డుగూడ నుంచి కర్జి వరకు రోడ్డు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కోత్మీర్ నుంచి దహెగాం వరకు నిలిచిన డబుల్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. పెంచికల్‌పేట్ వెళ్లే దారిలోని చిన్న వంతెన వద్ద హైలెవల్ వంతెన నిర్మాణం ప్రారంభిస్తామని పేర్కొన్నారు. సహకార సంఘం చైర్మన్ కోండ్ర తిరుపతిగౌడ్, వైస్ చైర్మన్ రాపర్తి ధనుంజ య్ తహసీల్దార్ మునవార్ షరీఫ్, ఎంపీడీవో రా జేందర్, బీజేపీ మండలాధ్యక్షుడు లగ్గామ దామోదర్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.