
మరింత చేరువలో సాంకేతిక పరిజ్ఞానం
తిర్యాణి: ఏఐ ద్వారా విద్యార్థులకు సాంకేతిక పరి జ్ఞానం మరింత చేరువైందని అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ పేర్కొన్నారు. శనివారం మండలంలో ని గంభీరావుపేటలోగల ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు, మ ధ్యాహ్న భోజనంలో నాణ్యత, తరగతుల నిర్వహణ ను పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలో ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని సందర్శించి ఓపీ వి వరాలు తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, క్రమం తప్పకుండా గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహించాలని సూచించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచి, మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన గురుకుల పాఠశాలను సందర్శించి నిత్యం పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు.
వసతుల కల్పనకు చర్యలు
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలోని తిర్యాణి బ్లాక్‌లో అంగన్‌వాడీలు, పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోనున్నట్లు అదనపు కలెక్టర్ దిపక్ తివారీ తెలిపారు. కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడా రు. తాగునీరు, మూత్రశాలలు, ఫ్యాన్లు, ఫర్నిచర్, మరుగుదొడ్లు తదితర అంశాలను ఇంజినీరింగ్, సంబంధిత అధికారులు పర్యవేక్షించి అవసరము న్న చోట అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించా రు. అంగన్‌వాడీ భవన నిర్మాణానికి తహసీల్దార్‌తో సమన్వయం చేసుకుని స్థలాలు గుర్తించాలని తెలి పారు. అధికారులు సమన్వయంతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా సంక్షేమాధికారి భాస్కర్, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కృష్ణ, డీఐఈవో కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.