
చట్టాలపై అవగాహన అవసరం
వాంకిడి: మహిళలు, బాలికలు హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యువరాజు సూచించారు. జిల్లా మహిళా సంక్షేమ శాఖ, మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో 10రోజుల పాటు జిల్లాలో ప్ర త్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్న ట్లు తెలిపారు. ఇందులో భాగంగా మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ఏర్పాటు చేసి న అవగాహన కార్యక్రమంలో జిల్లా మహిళా సంక్షేమశాఖ అధికారి భాస్కర్‌తో కలిసి పాల్గొని మాట్లాడారు. అణిచివేతలకు గురవుతున్న ఆయా వర్గాల మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకుని వాటి ని అధిగమించాలని సూచించారు. వరకట్న వేధింపుల నిషేధ చట్టం, బాల్యవివాహాల నిషేధ చట్టం, పోక్సో, మహిళల అక్రమ రవాణా, లింగ సమానత్వం, ప్రాథమిక హక్కులతో పాటు నూతనంగా అమలులోకి వచ్చిన వివిధ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తుండడం అభినందనీయమని తెలిపారు. విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పా టు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. 1098, 1811, 112, 14567, 1930, 100 హెల్ప్‌లైన్ నంబర్ల ద్వారా అందించే సే వలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మహిళా సాధికారత కేంద్రం సమన్వయకర్త శారద, కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ దేవేందర్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రయ్య పాల్గొన్నారు.