
నవోదయ విద్యాలయంలో ఘనంగా టీచర్స్ డే
కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ పట్టణంలోని పీఎంశ్రీ నవోదయ విద్యాలయంలో శుక్రవారం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా నవోదయ విద్యాలయ సమితి హైదరాబాద్ ప్రాంతీయ అసిస్టెంట్ కమిషనర్ చక్రపాణి హాజరయ్యారు. విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి విద్యార్థులను నవోదయ విద్యాలయానికి పంపిస్తున్నారని తెలిపారు. ఉపాధ్యాయులు చెప్పిన విషయాలను శ్రద్ధగా చదివి విద్యార్థులు ఉన్నత శిక్షఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తూ నాణ్యమైన విద్య అందిస్తుందని తెలిపారు. అంతకుముందు వి శ్రాంత ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రేపాల కృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.