
ప్రజల ఆరోగ్య రక్షణకు వైద్యశిబిరాలు
తిర్యాణి(ఆసిఫాబాద్): వర్షాకాలంలో వ్యాధులు ప్ర బలే అవకాశం ఉండటంతో ప్రజల ఆరోగ్య రక్షణకు గ్రామాల్లో ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నామని డీఎంహెచ్‌వో సీతారాం తెలిపారు. మండలంలోని కన్నెపల్లి, తలండి, చింతపల్లి గ్రామాల్లో వైద్యశిబిరాలను శుక్రవారం తనిఖీ చేశారు. ప్రజలకు అందిస్తున్న వైద్యసేవలు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ విషజ్వరాలను అరికట్టేందుకు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. పోషకాహారం తీసుకుంటూ శుద్ధమైన నీటిని తాగాలని సూచించారు. ఆయన వెంట వైద్యులు పల్లవి, వెంకటేశ్, అక్షిత, సిబ్బంది ఉన్నారు.