
పెండింగ్ ఉంచొద్దు
కొన్ని నెలలుగా మధ్యాహ్న భోజనం బిల్లు రాలేదు. ప్రభుత్వం ఇకపై బిల్లులు, వేతనాలు పెండింగ్‌లో ఉంచొద్దు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గౌరవ వేతనం రూ.10 వేలు చెల్లించాలి. పాఠశాలల్లో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.
– కమల, మధ్యాహ్న భోజన
నిర్వాహకురాలు, మోతుగూడ
ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం
రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్యికులకు గ్రీన్ చానల్ ద్వారా బిల్లులు చెల్లిస్తామని నిర్ణయించడం హర్షణీయం. పెండింగ్‌లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలి. గత ప్రభుత్వం పాఠశాలల్లో అమలు చేసిన అల్పాహారానికి సంబంధించి బిల్లులు నేటివరకు రాలేదు. అవి త్వరగా చెల్లించాలి. నిత్యావసర ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు సవరించాలి.
– కృష్ణమాచారి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు,
మధ్యాహ్న భోజన కార్మిక యూనియన్

పెండింగ్ ఉంచొద్దు