
ఆకట్టుకున్న జిల్లాస్థాయి కళోత్సవ్
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలిక ల ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన జిల్లాస్థాయి కళోత్సవ్ పోటీలు ఆకట్టుకున్నాయి. ఈ పోటీల్లో 15 మండలాల నుంచి 12 కళారూపాల్లో సుమారు 300 మంది విద్యార్థులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నా రు. ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి చిన్నతనం నుంచి ఒక కళను అలవాటు చేసుకుని సాధన చేయాలన్నారు. చదువుతో పాటు విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించాలన్నారు. రాష్ట్రస్థాయిలో జరిగే కళోత్సవ్ పోటీల్లో జిల్లా పేరు నిలబెట్టాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఉప్పులేటి శ్రీనివాస్, ఎంఈవో రాథోడ్ సుభాశ్, హెచ్‌ఎం జనార్ధన్, న్యాయనిర్ణేతలు కిల్లి వెంకట్రావు, వెంకన్న, వెంకటేశ్వర్లు, రాజనర్సు బాబు, శ్రీనాథ్, పద్మ, శ్రీలత, సురేశ్, శేఖర్, శంకర్, వివిధ పాఠశాలల గైడ్ టీచర్లు పాల్గొన్నారు.