వంట తంటాకు చెల్లు! | - | Sakshi
Sakshi News home page

వంట తంటాకు చెల్లు!

Sep 5 2025 5:34 AM | Updated on Sep 5 2025 5:34 AM

వంట తంటాకు చెల్లు!

వంట తంటాకు చెల్లు!

● ఇక నుంచి గ్రీన్‌ చానల్‌ ద్వారా నిర్వాహకులకు బిల్లులు ● పెండింగ్‌ లేకుండా నెలనెలా అందించేందుకు ప్రభుత్వ నిర్ణయం

ఆసిఫాబాద్‌రూరల్‌: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యా హ్న భోజనం వండుతున్న నిర్వాహకుల తంటాలు ఇక తీరనున్నాయి. ప్రతినెలా బిల్లులను ప్రభుత్వం గ్రీన్‌ చానల్‌ ద్వారా చెల్లించనుంది. ప్రస్తుతం జిల్లాలో 9, 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి ఐదు నెలల వంట బిల్లులు, ఆరు కోడిగుడ్డు బిల్లులు, మూడు నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నా యి. బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం వారికి ఊరట కలిగించనుంది.

జిల్లాలో ఇలా..

జిల్లాలోని 994 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, ఇందులో గిరిజన పాఠశాలలు 262, ప్రభుత్వ లోకల్‌బాడి పాఠశాలులు 732 ఉన్నాయి. ఆయా స్కూళ్లలో సుమారు 45 వేల మందికి ప్రతీరోజు మధ్యా హ్న భోజనం అందిస్తున్నారు. ప్రాథమిక పాఠశాల ల విద్యార్థులకు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వారికి ఒక్కొక్కరికి రూ.6.19, ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వారికి రూ.9.29, తొమ్మి ది, పదో తరగతి వారికి రూ.10.67 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. అదనంగా కోడిగుడ్డుకు రూ.6, గౌరవ వేతనం కింద నిర్వాహకులకు రూ.మూడు వేలు చెల్లిస్తున్నారు. వంట బిల్లుల్లో రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం, కేంద్రం ప్రభుత్వం 60శాతం భరిస్తోంది. అయితే ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వారికి మధ్యాహ్న భోజనం బిల్లులు ప్రభుత్వం సక్రమంగానే జమ చేస్తోంది. 9, 10వ తరగతి విద్యార్థులకు సంబంధించిన బిల్లులు మాత్రం నెలల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి.

చెల్లింపుల్లో తీవ్ర జాప్యం

ప్రస్తుతం ఉన్న బిల్లుల చెల్లింపుల విధానంతో మధ్యాహ్న భోజన నిర్వాహకులకు ఎదురుచూపులు తప్పడం లేదు. గౌరవ వేతనాలు, బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. అప్పులు చేసి వంట చేయాల్సిన వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయలు, వంట నూనె, ఇతర నిత్యావసరాల ధరలు పెరిగిపోవడంతో ప్రభుత్వం చెల్లించే బిల్లులు సరిపోవడం లేదని చెబుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గౌరవ వేతనం రూ.10 వేలు చెల్లించాలని కోరుతున్నారు.

గ్రీన్‌ చానల్‌ విధానం అయితే..

గ్రీన్‌ చానల్‌ విధానం అయితే మధ్యాహ్న భోజన బిల్లులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతినెలా ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా నేరుగా ఖాతాలో జమ చేస్తారు. ఏడాది మొత్తానికి అవసరమైన బిల్లులకు నిధులు కేటాయిస్తారు. నిధులకు ఇబ్బందులు లేకుండా ఖాతాల్లో జమ చేస్తారు. విద్యాశాఖ ప్రస్తుతం మధ్యాహ్న భోజనానికి సంబంధించిన వివరాల నమోదు కోసం యాప్‌ రూపొందించింది. ప్రస్తుతం అందులో వివరాలు నమోదు చేస్తున్నారు. గ్రీన్‌ చానల్‌ విధానం అమల్లోకి వస్తే ప్రతినెలా ఏ పాఠశాలలో.. ఎంత మంది కార్మికులకు ఎంత బిల్లు చెల్లించాలనే విషయం స్పష్టం తెలుస్తుంది. ప్రధానోపాధ్యాయుడు ఆమోదం తెలిపిన తర్వాత, ఎంఈవో సరిచూసుకుని ఆమోదిస్తే ట్రెజరీ శాఖ ప్రతినెలా నిర్వాహకుల ఖాతాల్లో నగదు జమ చేస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement