
మధ్యాహ్న భోజనం సక్రమంగా అందించాలి
ఆసిఫాబాద్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సక్రమంగా అందించాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండలంలోని జెండాగూడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను గురువారం తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారించాలని, వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని పరిశీలించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పరీక్షించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం అంకుసాపూర్ పాఠశాలను సందర్శించారు.
హాజరుపై ప్రతిరోజూ సమీక్షించాలి
ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరుపై ఎంఈవో లు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజూ స మీక్షించాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నా రు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో గురువారం దహెగాం, బెజ్జూర్, పెంచికల్‌పేట్, చింతలమానెపల్లి మండలాల విద్యాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించా రు. ప్రతిరోజూ ఉదయం 10 గంటలలోగా విద్యార్థుల హాజరుపై ప్రధానోపాధ్యాయులతో సమీక్షించాలన్నారు. 50 శాతం విద్యార్థులు గైర్హాజరవుతున్నారని, దీనిపై తల్లిదండ్రులతో మాట్లాడాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు సైతం ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరు కావొద్దన్నారు. సమావేశంలో పాఠశాలల సమన్వయకర్త అబిద్ అలీ తదితరులు పాల్గొన్నారు.