
సృజనాత్మకతకు కేరాఫ్
వాంకిడి: సృజనాత్మకతతో బోధిస్తూ విద్యార్థుల్లో శాసీ్త్రయ పరిజ్ఞానం పెంచుతున్నారు వాంకిడి మండల కేంద్రానికి చెందిన ఉపాధ్యాయుడు వడ్లూరి రాజేశ్. ప్రస్తుతం ఆయన ఆసిఫా బాద్ మండలం జన్కాపూర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్రం బోధిస్తున్నారు. వ్యవసాయ క్షేత్రాల్లో పంట సాగు విధానంపై మొక్కల ఎదుగుదల, చీడపీడల వృద్ధి తదితర వివరాలను సులభంగా అర్థమయ్యేలా బోధిస్తూ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో మన్ననలు అందుకుంటున్నారు. సృజనాత్మకతతో విద్యనందిస్తున్న ఆయనకు హర్యానాలోని ఫరిదాబాద్ యూనివర్సిటీకి చెందిన మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో డాక్టరేట్ అందించింది. రాష్ట్రస్థాయిలో టీచర్స్ బెస్ట్ ప్రాక్టిసెస్‌లో ఎంపికై ప్రతిభ చూపారు. జిల్లా, మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా పలుమార్లు ఎంపికయ్యారు. 2024లో నిర్వహించిన రాష్ట్రస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌లో విద్యార్థులతో కలిసి హాజరయ్యారు. 2024లో హైదరాబాద్‌లో నిర్వహించిన సైన్స్ డ్రామాలో రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో నిలిచారు. పిల్లలకు సృజనాత్మకతతో బోధిస్తే అంశాలపై పట్టు సాధించి, ఎప్పటికీ గుర్తుంచుకుంటారని ఉపాధ్యాయుడు రాజేశ్ చెబుతున్నారు.