
పాఠశాలల వివరాలు యాప్‌లో నమోదు చేయాలి
కాగజ్‌నగర్‌టౌన్: స్వచ్ఛహరిత విద్యాలయ యాప్ లో పాఠశాలల వివరాలు నమోదు చేయాలని జిల్లా సైన్స్ అధికారి కటుకం మధుకర్ అన్నారు. కాగజ్‌నగర్ పట్టణంలో ఎమార్సీ భవనంలో బుధవారం నిర్వహించిన స్వచ్ఛ హరిత విద్యాలయం శిక్షణ కా ర్యక్రమంలో మాట్లాడారు. యాప్‌లో తప్పనిసరిగా ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, తదితర వివరాలు నమోదు చేయాలని సూచించారు. పాఠశాలల్లో స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణ, హరిత వాతావరణ సృష్టి, విద్యార్థుల్లో శుభ్రత అలవాట్లు పెంపొందించే విధానాలను వివరించారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో కేంద్ర బృందం పరిశీలన అనంతరం ర్యాంకులు కేటాయిస్తారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా నోడల్ అధికారి జాడి దేవాజీ, ఎంఈవో వాసాల ప్రభాకర్, ప్రధానోపాధ్యాయులు, రిసోర్స్‌పర్సన్లు మామిడా ల తిరుపతయ్య, శాంతికుమార్ పాల్గొన్నారు.
104 ఉద్యోగుల నిరసన
ఆసిఫాబాద్‌అర్బన్: 17 ఏళ్లుగా సేవలందిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఐదు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని బుధవారం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట 104 ఉద్యోగులు నిరసన తెలిపారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ మాట్లాడుతూ 104 ఉద్యోగులను పీహెచ్‌సీ, టీబీ ఆఫీస్, టీ హాబ్ వంటి విభాగాల్లో విధుల్లో ఉంచారని తెలిపారు. కానీ ప్రభుత్వం ఏప్రిల్ నుంచి వేతనాలు విడుదల చేయలేదన్నారు. ఉద్యోగుల కొ నసాగింపుపై కూడా స్పష్టత ఇవ్వకపోవడంతో ఆందోళనకు గురవుతున్నామని తెలిపారు. ఇప్పటికై నా డిమాండ్లు తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ వెంకటేశ్ దోత్రేను కలిసి వినతిపత్రం అందించారు. తెలంగాణ యూనైటెడ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మహేంద్ర, ఉద్యోగులు రాజేశం, ప్రశాంత్, సత్యనారాయణ, తిరుపతి, రమేశ్, రమాదేవి, లలిత, లీలావతి, సూర్యకళ, రవి తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలల వివరాలు యాప్‌లో నమోదు చేయాలి