
అనుబంధాల వారధి.. రాఖీ
● నేడు రాఖీ పండుగ
ఆసిఫాబాద్‌అర్బన్/ఆసిఫాబాద్‌రూరల్: అక్కాతమ్ముళ్లు.. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి, ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే వేడుక రాఖీ పండుగ. జన్మనిచ్చిన అమ్మ ప్రేమను.. జీవితాన్ని పంచిన నాన్న అప్యాయతను అన్నదమ్ముల్లో చూసుకుంటారు సోదరీమణులు. అన్నా.. అని పిలిస్తే ఎంతటి కష్టంలోనైనా అండగా నిలుస్తాడని భావిస్తుంటారు. ఏటా శ్రావణమాసంలో పౌర్ణమి రోజున రాఖీ పండుగ జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది. శనివారం నిర్వహించే పండుగ కోసం సుదూర ప్రాంతాల నుంచి ఇప్పటికే ఆడబిడ్డలు జిల్లాకు చేరుకున్నారు. జిల్లాలోని వారు కూడా సోదరులకు రాఖీ కట్టేందుకు బయలుదేరి వెళ్తున్నారు. అనివార్య కారణాలతో వెళ్లలేని వారు కొరియర్ ద్వారా రాఖీలు పంపిస్తూ అనుబంధాన్ని చాటుతున్నారు. రాఖీ పండుగ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని షాపులల్లో సందడి నెలకొంది. శుక్రవారం వివేకానంద చౌక్, గాంధీచౌక్, అంబేడ్కర్ చౌక్‌ల్లో మహిళలు, యువతులు రాఖీలు కొనుగోలు చేశారు. వివిధ రకాల బొమ్మలతోపాటు ముందస్తుగా ఆర్డర్ ఇస్తే అన్నదమ్ముల పేర్లు, ఫొటోతో ముద్రించి ఇస్తున్నారు.
విడదీయలేని బంధం
సోదరులు, సోదరీమణుల బంధం జీవితంలో విడదీయరానిది. ప్రతీ సంవత్సరం ఎన్ని ముఖ్యమైన పనులు ఉన్నా వదులుకుని మహారాష్ట్రకు వెళ్తా. పూణేలో ఉన్న మా సోదరులకు రాఖీ కడతాను. అలాగే అక్కాచెల్లెళ్లు లేనివారికి రాఖీ కట్టడం ఎంతో తృప్తినిస్తుంది.
– సి.సుహాసిని, బీజేపీ మహిళా మోర్చా
రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యురాలు
జిల్లా కేంద్రంలో
రాఖీల దుకాణాల వద్ద సందడి
ముందుగానే వచ్చా..
నాకు వివాహం జరిగి నాలుగేళ్లు అవుతుంది. మహారాష్ట్రలో ఉంటున్నాం. ప్రతీ సంవత్సరం పండుగకు వస్తుంటా. ఈ ఏడాది ఒకరోజు ముందుగానే ఆసిఫాబాద్ మండలంలోని మోతుగూడలోని మా అన్న ఇంటికి వచ్చా. సోదరులకు రాఖీ కడతా. – నిరోష, మహారాష్ట్ర
ఆత్మీయతకు ప్రతీక
మాది పెద్ద కుటుంబం. చిన్నతనం నుంచి రాఖీ పండుగ ఘనంగా చేసుకుంటాం. అన్నదమ్ములకు ఏటా తప్పకుండా రాఖీ కడతా. ఆత్మీయతకు ప్రతీకగా నిలిచే పండుగ మహిళలకు రక్షణ ఇవ్వాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తోంది.
– కోలే నిర్మల, జైత్‌పూర్
అన్న ఇచ్చే కానుకలు దాచుకుంటా
మా సొంతూరు చెన్నూర్. కానీ వివాహం తర్వాత హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పర్చుకున్నాం. కానీ ఎన్ని పనులు ఉన్నా పెండింగ్ పెడ తాం. పుట్టిన ఊరిలో పండుగ జరుపుకోవడంలో ఉన్న సంతోషాన్ని మాటల్లో చెప్పలేం. రాఖీ కట్టిన తర్వాత అన్న అభిలాష్ ఇచ్చే కానుకలు భద్రంగా దాచుకుంటా. స్నేహితులు, బంధువులకు గర్వంగా చూపిస్తా.
– స్వప్న, హైదరాబాద్

అనుబంధాల వారధి.. రాఖీ

అనుబంధాల వారధి.. రాఖీ

అనుబంధాల వారధి.. రాఖీ

అనుబంధాల వారధి.. రాఖీ

అనుబంధాల వారధి.. రాఖీ

అనుబంధాల వారధి.. రాఖీ