
హాజరు శాతం పెంచాలి
ఆసిఫాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం పెంచాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జైనూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలను శుక్రవారం సందర్శించి వంటశాల, ఆహారం నాణ్యత, హాజరు పట్టిక, వసతిగృహంలో సదుపాయాలు, విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులు, తరగతి గదులు, పరిసరాలు పరిశీలించారు. అనంతరం రాసిమెట్ట గ్రామంలో పీఎం ఆవాస్ సర్వే ప్రక్రియను ప్రారంభించారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సర్వే పూర్తిచేయాలని సూచించారు. అనంతరం స్థానిక అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి, సిబ్బందికి సూచనలు ఇచ్చారు.