
మారని బతుకులు
● ఆదివాసీల జీవితాల్లో వెలుగేది? ● ‘గిరి’ గ్రామాలకు సౌకర్యాలు కరువు
● రోడ్లు లేవు.. వైద్యసేవలకూ తిప్పలే ● విద్యావకాశాలను అందిపుచ్చుకోని వైనం ● నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
దట్టమైన అడవిలో కాలినడక
తిర్యాణి(ఆసిఫాబాద్): ఈ చిత్రంలో కనిపిస్తున్న వారు తిర్యాణి మండలం మాణిక్యపూర్ పంచాయతీ పరిధిలోని బుగ్గరామన్న గూడెంకు చెందిన ఆదివాసీ మహిళలు. గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో నిత్యం మాణిక్యపూర్ వరకు దాదాపు 3.5 కిలోమీటర్ల దూరం దట్టమైన అడవిలో నడిచి వెళ్తున్నారు. దారంతా బండరాళ్లతోపాటు వాగులు అడ్డంకిగా ఉన్నాయి. ఈ గూడెంలో 14 కుటుంబాలు ఉండగా, 40 మంది నివాసం ఉంటున్నారు. అత్యవసర సమయంలో రాకపోకలు సాగించేందుకు, రేషన్ బియ్యం, నిత్యావసరాలు పింఛన్ కోసం ఇబ్బందులు పడుతున్నారు.