
విద్యాశాఖకు మంత్రిని కేటాయించాలి
ఆసిఫాబాద్‌రూరల్: కీలకమైన విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని కేటాయించాలని పీడీఎస్ యూ జిల్లా కార్యదర్శి తిరుపతి, ఎస్‌ఎఫ్‌ఐ జి ల్లా అధ్యక్షుడు సాయి అన్నారు. విద్యా సంస్థల బంద్‌లో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలను పీడీఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ వా మపక్ష విద్యార్థి సంఘాల నాయకులు మూసివేయించి, విద్యార్థులను ఇంటికి పంపించారు. వారు మాట్లాడుతూ ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలన్నారు. పోస్టుల భర్తీ, ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు, పెండింగ్ స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుద ల, గురుకులాలకు సొంత భవనాలు, విద్యార్థులకు ఉచిత బస్‌పాస్ ఇవ్వాలని డిమాండ్ చేశా రు. కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు టీకానంద్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణయ్, నాయకులు సతీష్, ప్రసాద్, నితిన్, సమీర్ తదితరులు పాల్గొన్నారు.