
సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలో టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్‌కు సంబంధించిన జీవో 49ను రాష్ట్ర ప్రభుత్వం నిలుపుదల చేయడంపై జిల్లా కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో మంగళవారం డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. డీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ ఆదివాసీ సంఘాల నాయకుల విన్నపంతో రాష్ట్ర ప్రభుత్వం జీవో 49ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు బాలేశ్వర్‌గౌడ్, మసాదె చరణ్, గాధెవేణి మల్లేశ్, కార్యకర్తలు పాల్గొన్నారు.