
తెలంగాణలో కలపాలని ఎమ్మెల్యేకు వినతి
ఆసిఫాబాద్‌అర్బన్: కెరమెరి మండలంలోని సరిహద్దు గ్రామమైన బోలాపటార్‌ను తెలంగాణ రాష్ట్రంలోనే కలపాలని గ్రామస్తులు మంగళవారం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మికి వినతిపత్రం అందించారు. వారు మాట్లాడుతూ ప్రస్తుతం తమకు తెలంగాణ లోనే ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, ఇతర ధ్రువపత్రాలు ఉన్నాయని తెలిపారు. మహారాష్ట్రలో విలీనం చేస్తే నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాన్ని తెలంగాణలో విలీ నం చేసేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మారుతి, సంతోష్, రమేశ్, బాలు, ఆనంద్‌రావ్, భీంరావ్, సోనేరావ్, వి నోద్, చిన్ను, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.