
రైళ్ల రాకపోకలకు అంతరాయం
● 24 నుంచి 27వరకు ఇంటర్ లాకింగ్ పనులు ● తాత్కాలికంగా కొన్ని, పాక్షికంగా మరికొన్ని రద్దు
బెల్లంపల్లి: పెద్దపల్లి రైల్వే జంక్షన్ శివారులో నిర్మిస్తు న్న బైపాస్ రైలుమార్గం ఇంటర్ లాకింగ్, నాన్ ఇంటర్ లాకింగ్ పనులు చేపట్టడానికి ఈ నెల 24నుంచి 27వరకు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది. బల్లార్షా–కాజిపేట మార్గంలో రాకపోకలు సాగించే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే శాఖ పూర్తి గా, మరికొన్ని తాత్కాలికంగా, ఇంకొన్ని పాక్షికంగా రద్దు చేసింది.
రద్దయినవి ఇవే..
కరీంనగర్–సిర్పూర్(టి)–కరీంనగర్ మెము ఎక్స్‌ప్రెస్, రామగిరి మెము ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఈ నెల 25నుంచి 27వరకు రద్దు చేశారు. బల్లార్షా–కాజిపేట–బల్లార్షా ఎక్స్‌ప్రెస్ 24నుంచి 26వరకు ఎగువ మార్గంలో బల్లార్షా వైపు, 25నుంచి 27వరకు దిగువ మార్గంలో కాజిపేట వైపు రద్దయింది. సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్‌నగర్–సికింద్రాబాద్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల 25నుంచి 27వరకు తాత్కాలికంగా రద్దు చేశారు.
పాక్షికంగా రద్దయినవి..
హైదరాబాద్–సిర్పూర్‌కాగజ్‌నగర్–బీదర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, భద్రాచలం రోడ్–బల్లార్షా–భద్రాచలం రోడ్డు వరకు రాకపోకలు సాగించే సింగరేణి మెము ఎక్స్‌ప్రెస్ ఈ నెల 25నుంచి 27వరకు, భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ ఎగువ మార్గంలో 24నుంచి 26వరకు, భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ దిగువ మార్గంలో 25నుంచి 27వరకు పాక్షికంగా రద్దు చేశారు.
ఆలస్యంగా నడిచేవి..
పెద్దపల్లి జంక్షన్ వద్ద రైల్వే బైపాస్‌ను అందుబాటులోకి తేవడానికి కొన్ని రైళ్లను ప్రారంభ స్టేషన్ నుంచి నిర్దేశించిన సమయం కంటే కొన్ని గంటలు ఆలస్యంగా బయల్దేరనున్నాయి.
● తిరుపతి–కరీంనగర్ బైవీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 26న తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి రా త్రి 8.05గంటలకు బయల్దేరాల్సి ఉండగా 2.30 గంటలు ఆలస్యంగా రాత్రి 10.35గంటలకు బయల్దేరుతుంది.
● న్యూఢిల్లీ నుంచి నాంపల్లి తెలంగాణ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ 24న దక్షిణ మధ్య రైల్వేజోన్ పరిధిలో 1.15గంటలు నియంత్రణ చేశారు.
● నిజాముద్దీన్ నుంచి కేఎస్సార్ బెంగళూర్ సిటీ మధ్య రాకపోకలు సాగించే రాజధాని సూపర్‌ఫా స్ట్ ఎక్స్‌ప్రెస్‌ను దక్షిణ మధ్య రైల్వేజోన్ పరిధిలో 20నిమిషాలు నియంత్రణ చేయనున్నారు.
● చెన్నయ్ సెంట్రల్ నుంచి న్యూఢిల్లీ వెళ్లే తమిళనాడు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో గంటసేపు నియంత్రిస్తారు.
● విశాఖపట్నం నుంచి న్యూఢిల్లీ వెళ్లే ఏపీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధి లో 45నిమిషాలు నియంత్రణ చేయనున్నారు.