
జాప్యం లేకుండా ఉద్యోగులకు సేవలు
రెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణి ఉద్యోగులకు జాప్యం లేకుండా సేవలందించాలని డీవైపీఎం ఎస్వీ రాజేశ్వర్‌రావు అన్నారు. గోలేటి టౌన్‌షిప్ లోని జీఎం కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల టెర్మినల్ బెనిఫిట్స్, గృహ రుణాల రాయితీ, కారుణ్య నియామకాలు, మెడికల్ బోర్డు తది తర సంక్షేమ పథకాలు, ఉద్యోగుల గైర్హాజరు అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. గనులు, డిపార్టుమెంట్ల వారీగా పెండింగ్ దరఖాస్తుల వివరాలు తెలుసుకున్నారు. దరఖాస్తుదారులకు నిత్యం సమాచారం అందిస్తూ, వేగంగా పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. ఉద్యోగులు ఉత్సాహంగా పనిచేస్తూ పెండింగ్ దరఖాస్తులు లేని ఏరియాగా బెల్లంపల్లిని నిల పాలని సూచించారు. సమావేశంలో సీనియర్ పర్సనల్ అధికారులు శ్రీనివాస్, ప్రశాంత్, సంక్షేమ అధికారి రజినికుమార్, జూనియర్ అసిస్టెంట్లు బాబా, సాగర్ పాల్గొన్నారు.