
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
ఆసిఫాబాద్: సీజనల్ వ్యాధులపై వైద్యారోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ వర్షాకాలంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల్లో నీటి నిల్వల స్థాయి, వినియోగం, వానాకాలం సీజన్‌లో వ్యవసాయ సాగు, యూరి యా నిల్వలు, ఎరువుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఫర్టిలైజర్ దుకాణాలు తనిఖీ చేస్తూ ఎరువులు పక్కదారి పట్టకుండా చూ డాలన్నారు. యూరియా స్టాకు వివరాలు ప్రతీ షా పు ఎదుట బోర్డుపై ప్రదర్శించే విధంగా చూడాలని సూచించారు. భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జనజీవనానికి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, రహదారులు తెగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కలెక్టర్లు అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకోవాలన్నారు. పిడుగుపాటుతో జరిగే నష్టాల వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు. గిరిజనులు అంటువ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 10 వరకు అన్ని నియోజకవర్గ కేంద్రాలు, మండలకేంద్రాల్లో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు అధికారికంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలన్నారు. జిల్లా కేంద్రంలో ని కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఏఎస్పీ చిత్తరంజన్, ఇరిగేషన్ అధికారులు గుణవంత్‌రావు, ప్రభాకర్, డీఎల్‌పీవో ఉమర్ హుస్సేన్, వ్యవసాయ శాఖ ఏడీ మిలింద్‌కుమార్, వైద్యారోగ్యశాఖ అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.