
క్రీడలతో ఉజ్వల భవిష్యత్
కౌటాల(సిర్పూర్): క్రీడలతో యువతకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని కాగజ్‌నగర్ డీఎస్పీ రామానుజం అన్నారు. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో కౌటాల పోలీస్‌స్టేషన్‌లో సోమవారం మండలస్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రథమ బహుమతి సాధించిన బోదంపల్లి జట్టుకు రూ.10వేలు, ద్వితీయ స్థానంలో నిలిచిన ముత్తంపేట జట్టుకు రూ.5 వేల నగదుతోపాటు బహుమతులు ప్రదానం చేశారు. ఆయన మాట్లాడు తూ గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలని, క్రీడలతో మానసికోల్లాసం, స్నేహభావం పె రుగుతుందన్నారు. మాదక ద్రవ్యాలు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించా రు. కార్యక్రమంలో సీఐ రమేశ్, ఎస్సై విజ య్, నాయకులు బుర్స నాగయ్య, సత్యనారా యణ, నాందేవ్ తదితరులు పాల్గొన్నారు.