కాలేజీలకు కొత్త శోభ | - | Sakshi
Sakshi News home page

కాలేజీలకు కొత్త శోభ

Jul 22 2025 7:57 AM | Updated on Jul 22 2025 8:19 AM

కాలేజ

కాలేజీలకు కొత్త శోభ

● ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ● కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో అనుసంధానం ● వసతుల కల్పనకు నిధులు సైతం.. ● హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు

కౌటాల(సిర్పూర్‌): ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల అభివృద్ధిపై రాష్ట్ర సర్కారు దృష్టి సారించింది. వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయడంతో పాటు నిఘా కోసం సీసీ కెమెరాలు ఏర్పాటుకు చర్యలు చేపడుతోంది. కొన్నేళ్లుగా అసౌకర్యాల మధ్య చదువులు కొనసాగుతున్న సర్కారు కాలేజీలు కొత్త శోభ సంతరించుకోనున్నాయి. దీనిపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 11 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. మొదటి సంవత్సరంలో 2వేల మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో 2,535 మంది చదువుకుంటున్నారు. జిల్లాలోని ఒక్కో కాలేజీలో 13 చొప్పున సీసీ కెమెరాలు అమర్చనున్నారు. ఇప్పటికే కౌటాల, కాగజ్‌నగర్‌ కళాశాలల్లో అమర్చగా, మిగతా చోట పనులు కొనసాగుతున్నాయి. తరగతుల నిర్వహణ పారదర్శకంగా ఉండేలా ప్రతీ తరగతి గదితోపాటు ఆరు బయట వరండా, ప్రయోగశాలల్లో కెమెరాలు ఏర్పా టు చేస్తున్నారు. రోజువారీగా విద్యార్థుల హాజరు, బోధన తీరు కళాశాలల నిర్వహణ తదితర అంశాల ను ఎప్పటికప్పుడు ప్రిన్సిపాల్‌తోపాటు ఉన్నతాధికారులు పర్యవేక్షించనున్నారు.

కమాండ్‌ నుంచి కంట్రోల్‌..

అధ్యాపకులతోపాటు విద్యార్థులు కళాశాలకు క్ర మం తప్పకుండా వస్తున్నారా.. లెక్చరర్లు సక్రమంగా పాఠాలు చెబుతున్నారా.. తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు.. తదితర అంశాలు పర్యవేక్షించేందుకు ఇంటర్‌ బోర్డు సీసీ కెమెరాలు వినియోగించనుంది. సీసీ కెమెరాలు హైదరాబాద్‌లో గల నాంపల్లి ఇంటర్‌బోర్డు కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో అనుసంధానించనున్నారు. అధ్యాపకులు పాఠాలు చెప్పే విధానాన్ని కూడా అధికారులు, నిపుణులు పర్యవేక్షిస్తారు. ఇంటరాక్టివ్‌ సీసీ కెమెరాల ద్వారా సూచనలిస్తారు. విద్యార్థులు కాలేజీలకు సక్రమంగా హాజరు కాకపోతే తల్లిదండ్రుల మొబైల్‌కు సందేశం పంపనున్నారు. పాఠశాలల్లో మాదిరిగా టీచర్‌, పేరెంట్‌ మీటింగ్‌కు కళాశాలల్లో కూడా ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేసేందుకు ఇంటర్‌బోర్డు ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

వసతుల కల్పనకు నిధులు..

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, మరమ్మతు కోసం నిధులు మంజూ రు చేశారు. ఏళ్లుగా వసతుల లేమితో సతమతమవుతున్న కళాశాలలకు మహర్దశ పట్టనుంది. జిల్లాలోని 11 జూనియర్‌ కళాశాలలకు రూ.1.64 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో భవనాల మరమ్మతు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, విద్యు త్‌ పనులు, తాగునీరు, గ్రీన్‌చాక్‌ బోర్డులు, డ్యూయ ల్‌ డెస్కులు, ఫ్యాన్లు, షెడ్లు, భవనాలకు రంగులు వంటి పనులు చేపట్టనున్నారు. ప్రభుత్వ పాఠశాల ల మాదిరిగానే ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల పనులను కూడా అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలకే అప్పగించాలని ఆదేశాలు వచ్చాయి.

నిధులు మంజూరు ఇలా..

కళాశాల నిధులు(రూ.లక్షల్లో)

జైనూర్‌ 15.70

కాగజ్‌నగర్‌ 28.82

సిర్పూర్‌(టి) 10.60

కౌటాల 20

బెజ్జూర్‌ 12.60

తిర్యాణి 16.80

దహెగాం 3.70

ఆసిఫాబాద్‌ 15.40

కెరమెరి 25.50

వాంకిడి 3.70

రెబ్బెన 11.60

సరైన నిర్ణయం

కళాశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం సరైన ని ర్ణయం. ఆకతాయిలు కళా శాల వైపు రాకుండా విద్యార్థినులకు భద్రత ఉంటుంది. అధ్యాపకులు క్రమం తప్పకుండా తరగతులు బో ధిస్తున్నారు. విద్యార్థుల హాజరు కూడా పెరిగింది. మధ్యాహ్న భోజనం అమలు చేస్తే బాగుంటుంది.

– స్వాతి, విద్యార్థిని, కౌటాల

నిరంతర పర్యవేక్షణ

జూనియర్‌ కళాశాలల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు సాంకేతిక నిపుణులు పనులు చేస్తున్నారు. కౌటాల, కాగజ్‌నగర్‌ కళాశాలల్లో ఏర్పాటు పూర్తయింది. కెమెరాలతో పూర్తి నిఘా ఉంటుంది. విద్యార్థుల హాజరు, అధ్యాపకులు సమయపాలన, ఫలితాల మెరుగుదలకు అవకాశం ఉంటుంది. అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని ఇంకా ఆదేశాలు రాలేదు. ఆదేశాలు రాగానే అమలు చేస్తాం.

– కళ్యాణి, డీఐఈవో

కాలేజీలకు కొత్త శోభ1
1/2

కాలేజీలకు కొత్త శోభ

కాలేజీలకు కొత్త శోభ2
2/2

కాలేజీలకు కొత్త శోభ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement