
జీఎంకు అధికారుల సంఘం వినతి
రెబ్బెన(ఆసిఫాబాద్): కైరిగూడ ఓసీపీ వద్ద అధికారులను నిర్బంధించడాన్ని ఖండిస్తూ బెల్లంపల్లి ఏరియా అధికారులు సోమవారం జనరల్ మేనేజర్ విజయ భాస్కర్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. అధికారుల సంఘం ఏరియా అధ్యక్షుడు నరేందర్ మాట్లాడుతూ ఆదివారం రెండో షిప్టుకు హాజరైన ఆపరేటర్లందరూ కలిసి అండర్ మేనేజర్ లక్ష్మీనారాయణ, మల్లయ్యను గదిలో నిర్బంధించి బయటకు రాకుండా ధర్నా చేశారన్నారు. మూడో షిఫ్టుకు హాజరయ్యే అండర్ మేనేజర్ లక్ష్మీనారాయణను పరిశీలనకు వెళ్లకుండా అడ్డుకోవడం సరికాదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం నాయకులు ఉజ్వల్‌కుమార్ బెహరా, ఉమాకాంత్, శ్రీనివాస రావు, కృష్ణమూర్తి, వీరన్న, మదీనాబాషా, శంకర్ తదితరులు పాల్గొన్నారు.