
మంత్రులను కలిసిన ఎమ్మెల్సీ
చింతలమానెపల్లి: నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్సీ దండె విఠల్, కాంగ్రెస్ నాయకులు శనివారం హైదరాబాద్‌లో సీ్త్ర, శిశు, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. డబ్బాలో స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని, సిర్పూర్‌లో ప్రయాణ ప్రాంగణం కోసం రూ.2 కోట్ల నిధులు కేటాయించాలని, హైదరాబా ద్‌కు అదనంగా బస్సు సర్వీసులు కల్పించాల ని కోరారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సిడాం గణపతి, చింతలమానెపల్లి, బెజ్జూర్ మండలాల అధ్యక్షులు సుల్కరి ఉమామహేష్, విశ్వేష్, నాయకులు గజ్జి రామయ్య, అశోక్, కొండు శంకర్, రాచకొండ శ్రీవర్థన్, తదితరులు పాల్గొన్నారు.

మంత్రులను కలిసిన ఎమ్మెల్సీ