పర్యావరణ పరిరక్షణ ప్రతీఒక్కరి బాధ్యత
● ఏఎస్పీ చిత్తరంజన్
ఆసిఫాబాద్‌అర్బన్: పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 300 మొక్కలు నాటామన్నారు. కేవలం చెట్లు మాత్రమే ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా మానవాళికి మేలు చేస్తాయని తెలిపారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని, నాటిన ప్రతీ మొక్కను సంరక్షించుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లాలోని సీఐలు, ఎస్సైలు, ఆర్‌ఎస్సైలు, జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


