మార్లవాయిని సందర్శించిన యూపీ బృందం
జైనూర్(ఆసిఫాబాద్): జాతీయ, రాష్ట్ర, జిల్లాస్థాయిలో పలు అవార్డులు అందుకున్న మండలంలోని మార్లవాయి గ్రామ పంచాయతీలో గురువారం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రజాప్రతినిధుల బృందం పర్యటించింది. ముందుగా ఆదివాసీల ఆత్మబంధువు ప్రొఫెసర్ హైమన్‌డార్ఫ్ దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పల్లె ప్రకృతి వనం, నర్సరీ, డార్ఫ్ స్మారక భవనం, రీడింగ్ రూమ్, గుస్సాడీ శిక్షణ కేంద్రం, ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. వారివెంట డీఆర్‌డీవో దత్తారావు, డీపీవో భిక్షపతిగౌడ్, తహసీల్దార్ బీర్షావ్, ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ కనక ప్రతిభ తదితరులు పాల్గొన్నారు.


