
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు సింగరే ణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఏరియా జీఎం రవిప్రసా ద్ అన్నారు. గోలేటిలోని జీఎం కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో మంగళవా రం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ పదో ఆవి ర్భావ వేడుకలకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జూన్ 2 నిర్వహించే వేడుకలకు సంబంధించిన ఎజెండా, కార్యక్రమాల నిర్వహణ సమర్థవంతంగా ఉండాలన్నారు. సీఈఆర్ క్లబ్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌వోటూజీఎం నరేందర్, ఏజీఎం తిరుమల్‌రావు, పీవో ఉమాకాంత్, పర్సనల్ మేనేజర్ తిరుపతి, ఎస్‌ఈ సివిల్ బాషా, సీనియర్ పర్సనల్ అధికారి ప్రశాంత్, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.