
సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి
కెరమెరి(ఆసిఫాబాద్): వేసవిలో సంక్రమించే సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారి తుకారం భట్ అన్నారు. మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రంతోపాటు గోయగాంలోని వెల్‌నెస్ సె ంటర్‌ను బుధవారం సాయంత్రం సందర్శించారు. రికార్డులు పరిశీలించి ఓపీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని సూ చించారు. వడదెబ్బ తగిలితే తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించాలన్నారు. మండల ప్రజలకు సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండాలన్నారు. ఎంఎల్‌హెచ్‌పీలు రాందాస్, శ్రీదివ్య, వైద్యసిబ్బంది లలిత, రాధాలక్ష్మి తదితరులు ఉన్నారు.