
జిల్లా కేంద్రంలో వైద్యురాలితో మాట్లాడుతున్న కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్: ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని సోమవారం సూపరింటెండెంట్ చెన్నకేశవులుతో కలిసి పరిశీలించారు. రికార్డులు పరిశీలించి రోగుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. వైద్యులు సమయపాలన పాటిస్తూ, రోగులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. ఆస్పత్రి పరిసరాలు, టాయిలెట్లను ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేయాలన్నారు. ఎండలతో ప్రజలు వడదెబ్బ బారినపడే అవకాశం ఉన్నందున ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు అవగాహన కల్పించాలన్నారు. ఎండవేడితో అస్వస్థతకు గురైతే తీసుకోవాల్సిన జా గ్రత్తలను వివరించాలని సూచించారు. ము ఖ్యంగా ఉపాధిహామీ కూలీలను అప్రమత్తం చేయాలన్నారు. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. రోగులతో మ ర్యాదగా వ్యవహరించాలని, రికార్డులు సక్రమంగా నమోదు చేయాలని ఆదేశించారు. ఆ స్పత్రిలో అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించారు. డీఎంహెచ్‌వో తుకారాంభట్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ నాగార్జునా చారి, ఇంజినీర్లు, వైద్యులు ఉన్నారు.