
రాష్ట్ర ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. మతతత్వ పార్టీ బీజేపీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో లేని అంశాల ను ప్రస్తావిస్తూ అసత్య ప్రచారం చేస్తుందన్నారు. గడిచిన పదేళ్ల పాలనలో బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టోలోని ఏ ఒక్క అంశాన్నైనా అమలు చేసిందా అని ప్రశ్నించారు. దేశ ప్రజలంతా దేవుళ్లను కొలుస్తారని, తాము అనేక గుడులను నిర్మించామన్నారు. కానీ దేవుడు మా వాడేనని మార్కెటింగ్ చేసుకునేలా బీజేపీ వ్యవహరించడం దుర్మార్గమని మండిపడ్డారు. అలాగే పదేళ్ల పాలనలో తెలంగాణ ప్రజలకు బీఆర్‌ఎస్ చేసిందేమీ లేదని ఆరోపించారు.