
మాట్లాడుతున్న కలెక్టర్ బదావత్ సంతోష్
● కలెక్టర్ బదావత్ సంతోష్
పాతమంచిర్యాల: పౌరహక్కులు, ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ చట్టాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, ఆ దిశగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్, డీసీపీ సుధీర్ రాంనాద్‌కేకన్, మంచిర్యాల, బెల్లంపల్లి, జైపూర్ ఏసీపీలు తిరుపతిరెడ్డి, సదయ్య, నరేందర్, ఆర్డీవోలు వేణు, శ్యామలాదేవి, జిల్లా షెడ్యూలు కులాల ఉపసంచాలకులు రవీందర్‌రెడ్డితో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ కేసులు త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. సివిల్ రైట్స్ డే సభలకు పంచాయతీరాజ్, పోలీస్, రెవెన్యూ, అటవీ, ఆరోగ్య, వ్యవసాయ సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యేలా చూడాలన్నారు. డీసీపీ సుధీర్‌రాంనాధ్‌కేకన్ మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కేసులను 60 రోజుల్లోగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని, రెండు మూడు రోజుల్లో ఆదిలాబద్ నుంచి అట్రాసిటీ కోర్టు మంచిర్యాలకు రానుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పోరేషన్ ఈడీ దుర్గాప్రసాద్, డీఆర్డీవో శేషాద్రి, తదితరులు పాల్గొన్నారు.
నీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలి
వేసవికాలం సమీపిస్తున్నందువల్ల మిషన్ భగీరథ నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. బుధవారం కలెక్టర్ చాంబర్‌లో మిషన్ భగీరథ ముఖ్య అభియంత బీసీ జ్ఞాన్‌కుమార్‌తో కలిసి అఽధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పైప్‌లైన్‌లు దెబ్బతిన్న ప్రాంతాల్లో యుద్దప్రాతిపదికన మరమ్మతు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రిడ్ ఈఈ మధుసూదన్, పీఆర్ ఈఈ ప్రకాష్, ఆర్‌అండ్ బీ ఈఈ రాము, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.