
మాట్లాడుతున్న ఎస్పీ సురేశ్‌కుమార్, పక్కన డీఎస్పీ కరుణాకర్
పెంచికల్‌పేట్(సిర్పూర్): యువత మంచి అలవాట్లను అలవర్చుకుని, ఉన్నత లక్ష్యం వైపు పయనించాలని ఎస్పీ కె.సురేశ్‌కుమార్ అన్నారు. పెంచికల్‌పేట్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్‌ను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ కెరీర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. క్రీడలతో మానసిక ఉల్లాసంతోపాటు శారీరక దారుఢ్యం పెరుగుతుందన్నారు. సమాజంలో మంచి నడవడికతో ఉంటూ సమాజ సేవకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మండలంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు వారీక పరీక్షలను ఎలాంటి భయం లేకుండా రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాక్షించారు. ఫ్రెండ్లీ పోలీస్‌లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రజలు, యువతతో మమేకం కావడం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో కాగజ్‌నగర్ డీఎస్పీ కరుణాకర్, రూరల్ సీఐ నాగరాజు, తహసీల్దార్ సరిత, ఎంపీడీవో గంగాసింగ్, ఎస్సైలు విజయ్‌కుమార్, సనత్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
ఎస్పీ సురేశ్‌కుమార్