
మాట్లాతున్న కలెక్టర్ హేమంత్ బోర్కడే
● కలెక్టర్ హేమంత్ బోర్కడే
ఆసిఫాబాద్: జిల్లాలో పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ హేమంత్ బోర్కడే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి జిల్లా మహిళా శిశు, దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పోషణ్ పక్వాడ కార్యక్రమంపై మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 20 నుంచి ఏప్రిల్ 3 వరకు అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్న పోషణ్ పక్వాడ కార్యక్రమంలో చిరుధాన్యాలతో కూడిన ఆహారాన్ని పిల్లలకు అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు సభ్యులు, ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయాలని సూచించారు. కార్యక్రమ నిర్వహణపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈవో రత్నమాల, జిల్లా సంక్షేమ అధికారి సావిత్రి, డీఎంహెచ్‌వో రామకృష్ణ, సీఈవో రవీందర్, సీడీపీవోలు, సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.