దరఖాస్తుల ఆహ్వానం
ఆసిఫాబాద్: జిల్లా మహిళా శిశు, వయోవృద్ధుల దివ్యాంగుల సంక్షేమ శాఖ పరిధిలోని మహిళా ఎంపవర్‌మెంట్ జిల్లా హబ్‌లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి సావిత్రి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 10 సాయంత్రం 5 గంటలలోగా అర్హులైన మహిళ, పురుష అభ్యర్థులు విద్యార్హత ధ్రువపత్రాలతో జిల్లా కేంద్రంలోని తమ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్షియల్ లిటరసీ(మహిళలు) పోస్టులకు ఆర్థిక/బ్యాంక్/తత్సమాన రంగాల్లో డిగ్రీ, పీజీ చదివిన వారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. కనీసం మూడేళ్లు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో అనుభవం కలిగి ఉండాలని, మల్టీ టాస్క్ సర్వెంట్(పురుషులు) పోస్టుకు పదో తరగతి, ఇంటర్ తత్సమాన ఉత్తీర్ణులై ఉండాలని తెలిపారు. పూర్తి వివరాలకు తమ కార్యాలయంలో సంప్రదించి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రవీంద్రనగర్ వారసంత ఆదాయం రూ.4.27 లక్షలు
చింతలమానెపల్లి(సిర్పూర్): మండలంలోని రవీంద్రనగర్– 2 వారసంతకు వేలం ద్వారా రూ.4.27 లక్షల ఆదాయం సమకూరింది. మంగళవారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో వేలం నిర్వహించారు. 2023– 24 సంవత్సరానికి సంబంధించి వారసంత వసూళ్లకు వేలం పాటను రూ.4.27లక్షలకు రవీంద్రనగర్– 1కు చెందిన గోవింద్‌బైన్ దక్కించుకున్నట్లు పంచాయతీ కార్యదర్శి విజయ్‌కుమార్ తెలిపారు. పంచాయతీ చట్టం ప్రకారం ధరలు నిర్ణయించి, వారసంత నిర్వహిస్తామని ఆయన వివరించారు. కార్యక్రమంలో ఎంపీవో సుధాకర్‌రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.