
ప్రశంసాపత్రం అందజేస్తున్న కలెక్టర్
జన్నారం: జిల్లా కేంద్రంలో పదో తరగతి విద్యార్థులకు మంగళవారం నిర్వహించిన ప్రతిభా పాటవ పరీక్షలో మండలంలోని కలమడుగు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు ప్రతిభ కనబరిచారు. శ్రీరాముల సంహిత జిల్లా స్థాయిలో రెండో స్థానంలో నిలువగా, కల్లెడ శివనందిని నాలుగోస్థానంలో నిలిచింది. మంగళవారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ సంతోష్‌నాయక్ వారికి ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. ట్రైనీ కలెక్టర్ గౌతమి, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, పాఠశాల హెచ్‌ఎం ప్రభాకర్, ఎన్‌సీసీ అధికారి కట్ట రాజమౌళి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.