ఎస్సెస్సీ ఫలితాల్లో ఉత్తమ మార్కులు
పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. ఈ సందర్భంగా జిల్లాలోని పలు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. వంద శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, పలువురు విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు. ఈ మేరకు ఆయా విద్యార్థులను పాఠశాలల యాజమాన్యాల తో పాటు ఉపాధ్యాయులు అభినందించారు. – ఖమ్మం సహకారనగర్
●రెజొనెన్స్ అద్భుత ఫలితాలు
●న్యూవిజన్ విజయ పరంపర
పదో తరగతి ఫలితాల్లో తమ విద్యార్థులు విజయ పరంపర కొనసాగించారని న్యూవిజన్ విద్యాసంస్థల చైర్మన్ సీ.హెచ్.జీ.కే.ప్రసాద్ తెలిపారు. పసుపులేటి హంసిని 592 మార్కులు సాధించగా, 90 శాతానికి పైగా మార్కులు 290 మంది సాధించారని చెప్పారు. అలాగే, 550 మార్కులు 230 మంది, 500కు పైగా 460 మంది సాధించారని తెలిపారు. ఈ ఏడాది ఫలితాల్లో అన్ని సబ్జెక్టుల్లో నూరు శాతం మార్కులు తమ విద్యార్థులు సాధించడం ఆనందంగా ఉందని తెలిపారు. విద్యార్థులను చైర్మన్‌తో పాటు డైరెక్టర్లు సీహెచ్.కార్తీక్, డైరెక్టర్ సీహెచ్.గోపీచంద్, ప్రిన్సిపాల్ ఎం.డీ.అబాద్ అలీ, జే.వీ.మైఖేల్, ఉపాధ్యాయులు అభినందించారు.
●రెజొనెన్స్ ఇన్ఫో స్కూల్ ప్రభంజనం
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో వీడీవోస్ కాలనీలోని రెజొనెన్స్ ఇన్ఫో స్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని డైరెక్టర్లు ఆర్.వీ.నాగేంద్రకుమార్, కె.శ్రీధర్‌రావు, నీలిమ తెలి పారు. ఎస్.దినేష్ 583మార్కులు, బి.సాయిబుద్ధకౌషిక్ 576 మార్కులు, సీహెచ్.వంశీతేజ 575, బి.వర్షిత్ 570, పి.శృతి 568, బి.యామిని 568, బి.చరణ్ 567, కె.పూజ 566, జె.జగదీష్ 565, ఎం.డీ.ఎతీషం అలీఖాన్ 564, ఎం.సూరజ్‌భార్గవ్ 562, ఎ.విశాల్ 562మార్కులు సాధించినట్లు తెలిపారు. ప్రతీఇద్దరిలో ఒకరు 500 మార్కులతో నూరుశాతం ఫలితాలు సాధించారని పేర్కొన్నారు.
●శ్రీచైతన్య టాప్
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో తమ విద్యార్థులు అగ్రస్థానాన నిలిచారని శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య తెలిపారు. శ్రీచైతన్య పాఠశాలలో విద్యార్థులను అభినందించాక వారు మాట్లాడారు. 600మార్కులకు గాను తమ విద్యార్థి కుంచాల వృత్తికాకృష్ణ 597మార్కులతో అగ్రస్థానాన నిలిచిందని చెప్పారు. అలాగే, వంగవీటి పూజిత లక్ష్మి, అమన్ అమృత 595 మార్కులు సాధించగా, 590కిపైగా 70 మంది, 580పైగా మార్కులు సాధించారని తెలిపారు.
ఐఏఎస్ అవుతా..
పదో తరగతిలో 600కి 597మార్కులు సాధించడం ఆనందంగా ఉందని కుంచాల వృత్తికాకృష్ణ వెల్లడించిందని ఐఏఎస్ కావాలన్నదే తన లక్ష్యమని వివరించింది. పాఠశాల యజమాన్యం శ్రీధర్, శ్రీవిద్య ప్రోత్సాహం, తల్లిదండ్రులు నాగలక్ష్మి, నాగరాజు సూచనలతో ఈ విజయం సొంతమైందని తెలిపింది. రోజు 13గంటల పాటు ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఉండడంతో మంచి ఫలితం వచ్చిందని వెల్లడించింది.
పదో తరగతిలో తమ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని శ్రీనివాసనగర్‌లోని రెజొనెన్స్ పాఠశాల డైరెక్టర్ నాగేంద్రకుమార్ తెలిపారు. పాఠశాల ప్రారంభించిన మొదటి బ్యాచ్‌లోనే వంద శాతం ఉత్తీర్ణత నమోదైందని పేర్కొన్నారు. విద్యార్థులను డైరెక్టర్‌తోపాటు కరస్పాండెంట్ నీలిమ, ఉపాధ్యాయులు అభినందించారు.


