ఖమ్మం రాపర్తినగర్: ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు వచ్చేనెల 4న మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఖమ్మం ఎస్‌ఆర్ గార్డెన్స్‌లో జరిగే మేళా పోస్టర్లను రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ దివాకర్ టీ.ఎస్ వేర్వేరుగా బుధవారం ఆవిష్కరించి మాట్లాడారు. వచ్చేనెల 4న ఉదయం 9గంటలకు మొదలయ్యే జాబ్‌మేళాలో 18 – 30 ఏళ్ల వయస్సు కలిగి ఎస్సెస్సీ మొదలు ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, బీ ఫార్మసీ, పీజీ చదివిన వారు పాల్గొనవచ్చని తెలిపారు. సుమారు 80 కంపెనీల బాధ్యులు పాల్గొననుండగా 3,200 మందికి ఉద్యోగాలు లభించే అవకాశముందని చెప్పారు. కాగా, నిరుద్యోగులు http://satg.telangana.gov.in/ prajapalana లేదా క్యూర్ కోడ్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి సూచించారు.


