సూపర్‌బజార్(కొత్తగూడెం): క్రీడలతో దేహదారుఢ్యం, మానసికోల్లాసం, ఆరోగ్యం దరిచేరుతుందని రాజ్య సభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రగతి మైదానంలో గాయత్రి క్రికెట్ చాంపియన్ షిప్ టోర్నీని శనివారం ఆయన ప్రారంభించా రు. తొలుత బీఆర్‌ఎస్ నాయకులు దిండిగల రాజేందర్, వనమా రాఘవేందర్, కాపు సీతాలక్ష్మి, మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుల గాంధీతో కలిసి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం ఎంపీ మాట్లాడు తూ యువత క్రీడలపై దృష్టి సారించి సూచించారు. పోటీల నిర్వాహకులు బి. శ్రీనివాస్, కన్నీ, బీఆర్‌ఎస్ నాయకులు ఏనుగుల రాకేష్‌రెడ్డి, రంగనాథ్, బాదావత్ శాంతి, కార్పొరేటర్లు మల్హోత్రా సాగర్, సింధు తపస్వీ తదితరులు పాల్గొన్నారు.
అండగా నిలుస్తాం
కొత్తగూడెంఅర్బన్: ఎన్నికలలో గెలిచినా, ఓడినా బీఆర్‌ఎస్ నేతలు ప్రజలకు అండగా నిలుస్తారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. కొత్తగూడెంలో జరిగిన పలు కార్యక్రమాలకు హాజరైన ఆయన మాజీ కౌన్సిల ర్ రుక్మాంగధర్ బండారి ఇంట్లో నాయకులతో మా ట్లాడారు. పద్మశాలి సంఘం నూతన కమిటీని అభినందించారు. మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి, బీఆర్‌ఎస్ నాయకులు వనమా రాఘవేంద్రరావు, దుండిగల రాజేందర్, ఆకుల గాంధీ, వేములప్రసాద్, అంబుల వేణు పాల్గొన్నారు.


