ఖమ్మం మామిళ్లగూడెం: రానున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ జెండాను ఎగురవేయడమే లక్ష్యంగా కార్యకర్తలు శ్రమించాలని పార్టీ జిల్లా ఇన్చార్జి బద్దం మహిపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఖమ్మంలో శనివారం జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తలు గెలుపే లక్ష్యంగా ఇప్పటినుంచే పనిచేయాలని, రాష్ట్రప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు, నాయకులు సన్నె ఉదయప్రతాప్, పుల్లారావు, గల్లా సత్యనారాయణ, గోంగూర వెంకటేశ్వరరావు, రమేష్, రుద్ర ప్రదీప్, నున్న రవికుమార్, విజయరాజు, గుత్తా వెంకటేశ్వరరావు, రాఘవరావు పాల్గొన్నారు.


