30వరకు సాగర్‌ జలాలు విడుదల చేయండి | - | Sakshi
Sakshi News home page

30వరకు సాగర్‌ జలాలు విడుదల చేయండి

Apr 5 2026 7:42 AM | Updated on Apr 5 2026 7:42 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ ద్వారా ఈనెల 30 వరకు నీరు విడుదల చేయాలని సీపీఐ నాయకులు కోరారు. ఈ సందర్భంగా శనివారం సీఈ మంగళపూడి వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశాక సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు మాట్లాడారు. జిల్లాలో ఎడమ కాలువ కింద రెండున్నర లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతుండగా, వరి, మొక్కజొన్న, మిర్చికి ఈ నెలాఖరు వరకు నీరు అవసరం ఉందని తెలిపారు. ఈమేరకు వారబందీ విధానంలో కాకుండా నెలాఖరు వరకు పూర్తి స్థాయిలో నీరు విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్‌ మహ్మద్‌ మౌలానా, జిల్లా కార్యదర్శి దండి సురేష్‌, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు దొండపాటి రమేష్‌, నాయకులు నంబూరి శంకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు డాక్టరేట్‌

ఖమ్మం మామిళ్లగూడెం: ఖమ్మం బ్రౌన్స్‌ ఫార్మసీ కళాశాల అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఫాలక్‌ నాజ్‌కు డాక్టరేట్‌ లభించింది. ఫార్మకాలజీ అంశంపై ఆమె ప్రొఫెసర్‌ డాక్టర్‌ ప్రవీణ పర్యవేక్షణలో సమర్పించిన పరిశోధనాత్మక గ్రంధానికి హైదరాబాద్‌లోని చైతన్య డీమ్డ్‌ టు బీ యూనివర్సిటీ డాక్టరేట్‌ ప్రకటించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన యూనివర్సిటీ స్నాతకోత్సవంలో డైరెక్టర్‌ డాక్టర్‌ రామానుజ నారాయణ్‌, యూనివర్సిటీ చాన్సలర్‌ డాక్టర్‌ సీహెచ్‌.వీ.పురుషోత్తంరెడ్డి, వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ జి.శంకర్‌లింగం చేతుల మీదుగా ఫాక్‌నాజ్‌ డాక్టరేట్‌ అందుకున్నారు. కాగా, ఆమె భర్త అస్లాంఖాన్‌ షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖలో సీనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement