ఖమ్మంమయూరిసెంటర్: పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని ప్రముఖ వైద్యుడు యలమంచిలి రవీంద్రనాథ్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌రావు అన్నారు. బీపీ, షుగర్ బాధితుల కోసం నెలనెలా బోడేపూడి విజ్ఞాన కేంద్రం (బీవీకే) – సీపీఎం ఖమ్మం టు టౌన్ కమిటీ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న ఉచిత మెడికల్ క్యాంపులకు దశాబ్దం పూర్తవుతున్న సందర్భంగా ఖమ్మం మంచికంటి ఫంక్షన్ హాల్‌లో శనివారం మెగా క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూ.100 ఫీజుతో నెలకు సరిపడా మందులు అందిస్తూ పదేళ్లుగా శిబిరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ విషయంలో దివంగత ఎమ్మెల్యే బోడేపూడి వెంకటేశ్వరరావు చూపిన శ్రద్ధను గుర్తు చేసుకున్నారు. అనంతరం సీపీఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై.విక్ర మ్ మాట్లాడుతూ మొదట్లో క్యాంపునకు 40–50 మంది హాజరయ్యేవారని, ఇప్పుడు 500 మందికి పైగా వస్తున్నారని తెలిపారు. శిబిరాలకు సహకరిస్తున్న వీవీసీ సంస్థల అధినేత వంకాయలపాటి రాజేంద్రప్రసాద్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కురువెళ్ల ప్రవీణ్‌కుమార్, ప్రముఖ వ్యాపాని భీమనాదుల పుల్లారావు, వైద్యులు చీకటి భారవి, రవీంద్రనాథ్, రంగారావు, సుబ్బారావుతో పాటు క్యాంపునకు హాజరైన వైద్యులను సన్మానించారు. బీవీకే వైస్ చైర్మన్ యలమద్ది శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, వివిధ విభాగాల వైద్యులు పేర్ల హర్షతేజ, పిల్లలమర్రి సుబ్బారావు, యలమూడి మనో జ్, రావెళ్ల రంజిత్, అడప జయశ్రీ, యమున, రజిత, శ్రీలేఖ, రావూరి హర్ష, వినీషా, తన్మయి, రంగారావు, సురేష్‌తో పాటు నాయకులు యర్రా శ్రీని వాస్, మెరుగు సత్యనారాయణ, బోడపట్ల సుదర్శన్, పొన్నం వెంకటేశ్వరరావు, పారుపల్లి ఝాన్సీ, ఎం.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.


