50 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

50 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం స్వాధీనం

Apr 5 2026 7:42 AM | Updated on Apr 5 2026 7:42 AM

డీలర్‌ నుంచి నేరుగా తరలిస్తున్నట్లు వెల్లడి

తిరుమలాయపాలెం: డీలర్‌ నుంచే నేరుగా సన్నబియ్యం అక్రమ రవాణా చేస్తున్న విషయం పోలీసుల తనిఖీల్లో బయటపడింది. ఇందుకు సంబంధించి తిరుమలాయపాలెం ఎస్‌ఐ కె.జగదీష్‌ వెల్లడించిన వివరాలు.. మండల కేంద్రం సమీపాన కొక్కిరేణి క్రాస్‌ వద్ద వద్ద శనివారం వాహన తనిఖీలు చేపడుతుండగా అశోక్‌ లేలాండ్‌ వాహనంలో పరిశీలించారు. అందులో 50 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం ఉండగా, వాహనంలోని ఖమ్మం కాల్వొడ్డుకు చెందిన నేరేళ్ల శ్రీకాంత్‌, ధరావత్‌ రమేష్‌, పగిళ్ల గణేష్‌ను విచారించారు. వీరు మేడిదపల్లికి చెందిన రేషన్‌ డీలర్‌ భర్త రామాచారి ద్వారా బియ్యం సేకరించి ఖమ్మంకు చెందిన షేక్‌ నన్నేమియా ద్వారా పెద్ద వ్యాపారులకు ఎక్కువ ధరతో అమ్మేందుకు తీసుకెళ్తున్నట్లు వెల్లడించారు. ఈమేరకు ఐదుగురిపై ఐదుగురు కేసు నమోదు చేశామని, పరారీలో ఉన్న డీలర్‌ భర్త రామాచారి తప్ప మిగతా వారిని అరెస్ట్‌ చేసినట్లు ఎస్‌ఐ వెల్లడించారు. కాగా, నలుగురు నిందితులు ఇటీవల డీలర్ల నుండి బియ్యాన్ని సేకరించి లారీలో తీసుకెళ్తూ హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులకు పట్టుబడినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement