పర్యాటక సర్క్యూట్‌లో చేర్చాలి | - | Sakshi
Sakshi News home page

పర్యాటక సర్క్యూట్‌లో చేర్చాలి

Mar 31 2026 7:26 AM | Updated on Mar 31 2026 7:26 AM

నేలకొండపల్లి స్థూపంపై లోక్‌సభలో

ఎంపీ రఘురాంరెడ్డి

నేలకొండపల్లి: దక్షిణ భారతదేశంలోకెల్లా అతి పెద్దదైన నేలకొండపల్లిలోని బౌద్ధక్షేత్రం అభివృద్ధిపై కేంద్రప్రభుత్వం దృష్టి సారించాలని ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి కోరారు. లోక్‌సభలో సోమవారం మాట్లాడిన ఆయన ప్రాచీన వారసత్వ కట్టడమైన బౌద్ధ స్థూపాన్ని సంరక్షించేందుకు తక్షణ చర్యలు అవసరమని పేర్కొన్నారు. ప్రాధాన్యత కలిగిన క్షేత్రం నిర్లక్ష్యానికి గురవుతున్నందున సరైన రహదారి నిర్మించడంతో పాటు సదుపాయాలు కల్పించాలని కోరారు. అంతేకాక జాతీయ బౌద్ధ పర్యాటక సర్క్యూట్‌లో చేరిస్తే దేశ, విదేశ పర్యాటకులను ఆకర్షించొచ్చని, స్థానికులకు ఉపాధి మెరుగుపడతాయని ఎంపీ అభిప్రాయపడ్డారు.

న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేయండి

ఖమ్మం లీగల్‌: బార్‌ కౌన్సిల్‌ ద్వారా న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్‌ సూచించారు. ఇటీవల కౌన్సిల్‌ సభ్యుడిగా ఎన్నికై న మందడపు శ్రీనివాసరావుకు సోమవారం బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి రాజగోపాల్‌ మాట్లాడుతూ ఖమ్మం నుంచి బార్‌ కౌన్సిల్‌లో ప్రాతినిధ్యం ఉండడం సంతోషకరమన్నారు. కౌన్సిల్‌ మాజీ సభ్యుడు కొల్లి సత్యనారాయణ, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు తొండపు వెంకటేశ్వరరావుతో పాటు న్యాయవాదులు పాల్గొన్నారు.

చట్టాల పునరుద్ధరణ డిమాండ్‌తో రేపు ‘బ్లాక్‌ డే’

ఖమ్మంమయూరిసెంటర్‌: రద్దు చేసిన 29 కార్మిక చట్టాలను వెంటనే పునరుద్ధరించాలని అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. చట్టాల పునరుద్ధరణ, నాలుగు లేబర్‌ కోడ్ల రద్దు డిమాండ్‌తో బుధవారం బ్లాక్‌ డే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఖమ్మంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు గాదె లక్ష్మీనారాయణ అధ్యక్షతన సోమవారం నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దుచేసి, యాజమాన్యాలకు అనుకూలంగా కేంద్రప్రభుత్వం నాలుగు లేబర్‌ కోడ్లను తీసుకొచ్చిందని తెలిపారు. వీటిని రద్దు చేసి పాత చట్టాలను పునరుద్ధరించాలనే డిమాండ్‌తో చేపడుతున్న బ్లాక్‌ డేకు అందరూ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు తోట రామాంజనేయులు, రావి శివరామకృష్ణ, టి.విష్ణువర్ధన్‌, సీవై.పుల్లయ్య, కె.శ్రీనివాస్‌, కె.రామకృష్ణ, సిద్దెల నగేష్‌, సుభానీ పాల్గొన్నారు.

ఎఫ్‌ఎల్‌ఎస్‌ సర్వే ప్రారంభం

ఖమ్మం సహకారనగర్‌: ఎంపిక చేసిన పాఠశాలల్లోని మూడో తరగతి విద్యార్థుల విద్యాసామర్థ్యాలను అంచనా వేసేందుకు చేపట్టిన ఫౌండేషనల్‌ లెర్నింగ్‌ స్టడీ(ఎఫ్‌ఎల్‌ఎస్‌)సర్వే సోమవారం ప్రారంభమైంద. రెండో రోజుల పాటు సాగే ఈ సర్వే కోసం జిలాల్లోని ఖమ్మం మోమినాన్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, బల్లేపల్లిలోని సెయింట్‌ ఫ్రాన్సిస్‌ డిసెల్స్‌ స్కూల్‌, ముస్తఫానగర్‌లోని జెమ్స్‌ స్కూల్‌తో పాటు ముదిగొండ మండలం కమలాపురంలోని సాయిమెరిట్‌ స్కూల్‌ను ఎంపిక చేశారు. తొలిరోజు ఆయా పాఠశాలల్లో సర్వేను డీఈఓ చైతన్యజైనీ పరిశీలించి వాస్తవ వివరాలు నమోదు చేసేలా జాగ్రత్త వహించాలని ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్లకు సూచనలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సర్వే ద్వారా మూడో తరగతి విద్యార్థుల్లో తెలుగు, ఉర్దూ, గణితంలో ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాజ్ఞానం సామర్థ్యాలను అంచనా వేస్తున్నట్లు తెలిపారు. జిల్లా అకడమిక్‌ మానిటరింగ్‌ అధికారి పి.ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement