ఊరు కాదని.. దిక్కు లేదని | - | Sakshi
Sakshi News home page

ఊరు కాదని.. దిక్కు లేదని

Mar 31 2026 7:26 AM | Updated on Mar 31 2026 7:26 AM

వలస కూలీలతో మూడు నెలల పాటు పని చేయించుకున్న ఓ కాంట్రాక్టర్‌ డబ్బు ఇవ్వకుండా కాలం గడుపుతున్న వైనం బయటపడింది. మధ్యప్రదేశ్‌కు చెందిన 28 మంది కూలీలు రఘునాథపాలెం

మండలం కోటపాడుకు చెందిన కాంట్రాక్టర్‌ సూచనతో పొట్టకూటి కోసం వచ్చారు. పలువురు రైతుల మిర్చి చేన్లలో మూడు నెలల పని చేయించగా రూ.6.65 లక్షలు ఇవ్వాల్సి ఉంది. అయితే డబ్బు ఇవ్వకపోగా ముఖం చాటేయడంతో వారంతా సోమవారం కలెక్టరేట్‌కు వచ్చారు. కానీ పోలీసులు వారిని అనుమతించకపోవడంతో బయట వేచిఉన్నారు. చివరగా కాంట్రాక్టర్‌కు ఫోన్‌

చేయడంతో మాట్లాడదామని పిలవగా 10మంది వెళ్లారు. అయితే సాయంత్రం వరకు వారికి డబ్బు ఇవ్వలేదని వాపోయారు. – స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement