ఖమ్మంసహకారనగర్: యుద్ధం మానవాళి మనుగడను ప్రశ్నార్ధకం చేస్తోందని ప్రముఖ విద్యావేత్త ఎల్.వీ.రమణారావు అన్నారు. టీపీటీఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యాన సోమవారం ఖమ్మంలో జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు అధ్యక్షతన ‘ఇరాన్‌పై ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం – పరిణామాలు‘ అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్‌లో రమణారావు మాట్లాడుతూ అమెరికా, ఇజ్రాయిల్ పాలకుల వ్యక్తిగత స్వార్థాలకు ప్రతీకగా ఈ యుద్ధం నిలిచిందని చెప్పారు. యుద్ధ ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్, గ్యాస్ కొరత ఏర్పడిందని పేర్కొన్నారు. సెమినార్‌లో టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.విజయ్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంగళరావు, నాయకులు పి.నాగిరెడ్డి, మనోహర్‌రాజు, సంధ్యారాణి, ఉమాదేవి, మల్ల య్య, గరిక శ్రీను, ెవెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


