అభివృద్ధి, సంక్షేమం దిశగా బడ్జెట్‌ | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి, సంక్షేమం దిశగా బడ్జెట్‌

Mar 31 2026 7:26 AM | Updated on Mar 31 2026 7:26 AM

కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ

ఖమ్మంమయూరిసెంటర్‌: అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్‌ తెలిపారు. అందులో భాగంగానే రూ.3.24 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో సంక్షేమం, వ్యవసాయం, నీటిపారుదల రంగాలకు కేటాయింపులు చేశారని వెల్లడించారు. అలాగే, ఆరు గ్యారంటీల అమలుకు ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. ఇక అంగన్‌వాడీల్లో పిల్లలకు అల్పాహారం సమకూర్చనున్నారని చెప్పారు. బడ్జెట్‌ రూపకల్పన, రాష్ట్ర అభివృద్ధిలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాత్ర చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలిపారు. అయితే, భట్టి ప్రవేశపెట్టిన అత్యుత్తమ బడ్జెట్‌ను ఓర్వలేక ప్రతిపక్షాలు ఆయనను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని సత్యనారాయణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement